నయనతారకే చిరు ఓటు..!

January 18, 2019


img

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఉయ్యాలవడా నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ హీరోలకు హీరోయిన్స్ కరువవుతున్న ఈ సమయంలో చిరంజీవి ఏరి కోరి నయనతారని ఎంపిక చేసుకున్నారు. రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 సినిమాకు హీరోయిన్ సమస్య ఏర్పడగా కాజల్ ని ఒప్పించి మేనేజ్ చేశారు.

ఇదిలాఉంటే సైరా తర్వాత చిరు చేస్తున్న కొరటాల శివ సినిమాకు చిరు పక్కన హీరోయిన్ ఎవరా అన్న చర్చ మొదలైంది. అయితే సైరా సినిమాలో చేస్తున్న నయనతారనే కొరటాల శివ సినిమాకు రిపీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయిన ఈ సినిమా హీరోయిన్ వర్షన్ నయనతారకు వినిపించాల్సి ఉందట. రెమ్యునరేషన్ భారీగానే ఇస్తారు కాబట్టి చిరు సరసన మరోసారి నటించేందుకు నయన ఓకే చెప్పడం ఖాయమని అంటున్నారు. సైరా తర్వాత కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.



Related Post

సినిమా స‌మీక్ష