ఎన్.టి.ఆర్ ను దించిన ఆర్జివి

January 18, 2019


img

ఎన్.టి.ఆర్ బయోపిక్ డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తుందని ఆశపడ్డ ఆర్జివి ఆ ఛాన్స్ రాకపోయే సరికి ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాకు పోటీగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంటూ మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. తాను చెప్పేదే అసలు ఎన్.టి.ఆర్ జీవిత కథ అంటూ చెప్పుకొస్తున్న వర్మ ఫైనల్ గా సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్ ను రిలీజ్ చేశాడు. జనవరి 18 ఎన్.టి.ఆర్ వర్ధంతి సందర్భంగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ నుండి ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు ఆర్జివి.

వర్మ సినిమాల్లో కాస్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది. అలానే ఎన్.టి.ఆర్ పాత్రలో అచ్చం అలాంటి ముఖ వచ్చస్సు కలిగిన వ్యక్తిని పట్టేశాడు. వర్ధంతి సందర్భంగా రిలీజ్ చేసిన ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. జస్ట్ అలా కుర్చిలో కూర్చుని చూస్తున్న ఎన్.టి.ఆర్ విజువల్ మాత్రమే వదిలాడు వర్మ. ఈ ఫస్ట్ లుక్ తో తానేమి కామెడీగా ఈ సినిమా చేయట్లేదని చెప్పకనే చెప్పినట్టు ఉంది. ఈ నెల 25న రిలీజ్ అవనున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.   

  



Related Post

సినిమా స‌మీక్ష