పోసాని డైరక్షన్ లో వైఎస్ జగన్ బయోపిక్

January 18, 2019


img

తెలుగు పరిశ్రమలో బయోపిక్ ల హవా ఏ రేంజ్ లో కొనసాగుతుందో అందరికి తెలిసిందే. మహానటి సినిమాతో ఆ ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఇక రీసెంట్ గా ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్సార్ బయోపిక్ గా వస్తున్న యాత్ర సినిమా కూడా వచ్చే నెల రిలీజ్ కానుంది. ఇలాంటి టైంలో మరో బయోపిక్ సినిమా రాబోతుందని తెలుస్తుంది. అది ఎవరిదో కాదు యువనేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్.   

రైటర్ కమ్ డైరక్టర్ కమ్ యాక్టర్ పోసాని కృష్ణ మురళి ఈ బయోపిక్ ను డైరెక్ట్ చేస్తున్నారట. ఈమధ్యనే పులివెందులలో షూటింగ్ కూడా మొదలు పెట్టారట. పులివెందుల పరిసర ప్రాంతాల్లోనే కేవలం 25 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తుంది. వై.ఎస్ జగన్ మీద ఉన్న అభిమానంతో పోసాని ఈ బయోపిక్ చేస్తున్నాడని అంటున్నారు. శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా పక్కా ఎలక్షన్స్ టార్గెట్ తో వస్తుందని అభిప్రాయపడుతున్నారు. చెప్పాలనుకునే పాయింట్ సూటిగా సుత్తి లేకుండా చెప్పే పోసాని వై.ఎస్ జగన్ బయోపిక్ ను ఎలా తీస్తాడో చూడాలి.     



Related Post

సినిమా స‌మీక్ష