వెంకీ ఈజ్ బ్యాక్..!

January 16, 2019


img

సరైన సినిమా పడాలే కాని తన సత్తా ఏంటో చూపించాలని ఎదురుచూస్తున్న వెంకటేష్ కు పర్ఫెక్ట్ గా ఫిట్ అయిన సినిమా ఎఫ్-2. నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి సినిమాల్లో లాంటి వింటేజ్ వెంకీని మళ్లీ గుర్తుచేసేలా ఎఫ్-2లో వెంకటేష్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఈ సంక్రాంతికి అసలు సిసలు సూపర్ హిట్ బొమ్మగా ఎఫ్-2 ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరిస్తుంది. 

ఇక ఎఫ్-2 సినిమా చూసిన వెంకీ ఫ్యాన్స్ అయితే వెంకీ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఎఫ్-2లో కొన్ని సీన్స్  వెంకటేష్ మాత్రమే చేయగలడు అనిపించింది. తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించడంలో వెంకీ అదరగొడతాడు. మరి ఎఫ్-2తో వచ్చిన ఈ ఉత్సాహం ఇలాంటి సినిమాలే చేసి తన ఫ్యాన్స్ ను మరింత అలరించాలని ఆశిద్దాం. ఎఫ్-2లో వెంకటేష్ తో పాటుగా వరుణ్ తేజ్ కూడా తెలంగాణా యాసలో మెప్పించాడు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతికి సూపర్ హిట్ సినిమా అనిపించుకుని కలక్షన్స్ అదరగొడుతుంది.  


Related Post

సినిమా స‌మీక్ష