బ్రహ్మానందంకు హార్ట్ సర్జరీ

January 16, 2019


img

తెలుగు సినిమా నటుడు హాస్య బ్రహ్మ బ్రహ్మానందంకు బైపాస్ సర్జరీ జరిగినట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న బ్రహ్మానందం ఆదివారం ముంబైలోని ఏ.హెచ్.ఐ లో జాయిన్ అయ్యారట. టెస్టుల ద్వారా బైపాస్ కంపల్సరీ అని తేలడంతో సోమవారం బైపాస్ సర్జరీ జరిపినట్టు సమాచారం. కార్డియాక్ సర్జర్ రమాకాంత్ పాండా బ్రహ్మానందంకు సర్జరీ చేశారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. హాస్పిటల్ లో అబ్సర్వేషన్ లో ఉంచారట. 1000 సినిమాలకు పైగా నటించి గిన్నీస్ బుక్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నాడు బ్రహ్మానందం. ఆయన ఆరోగ్యం బాగాలేదన్న వార్త విన్న అభిమానులు, సిని సెలబ్రిటీస్ కాస్త కంగారు పడ్డారు. సర్జరీ సక్సెస్ అవడంతో కుదుటపడ్డారు. హాస్పిటల్ లో బ్రహ్మానందం తనయులు గౌతం, సిద్ధార్త్ ఇద్దరు ఉన్నట్టు తెలుస్తుంది.

 


Related Post

సినిమా స‌మీక్ష