సైరాలో రాజా పాండి.. లుక్ అదిరింది..!

January 16, 2019


img

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాం చరణ్ నిర్మిస్తున్నాడు. 250 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో చిరుతో పాటుగా ఇతర భాషల స్టార్స్ కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ నుండి అమితాబ్, కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి, కన్నడ పరిశ్రమ నుండి సుదీప్ ఇలా అందరు సైరాలో ఉన్నారు. అంతేకాదు టాలీవుడ్ హీరో కం విలన్ జగపతి బాబు కూడా సైరాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి రాజా పాండి పాత్రలో కనిపించనున్నాడు. ఆ పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్ ఈరోజు విజయ్ సేతుపతి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. పరమ శివభక్తుడైన రాజా పాండి చేతిలో మొండికత్తితో ఫస్ట్ లుక్ తో అదరగొట్టాడు. కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఏరి కోరి చేస్తున్న ఈ పాత్ర సినిమాకు హైలెట్ గా ఉంటుందని చెప్పొచ్చు. సైరా నుండి రాజా పాండి ఫస్ట్ లుక్ అదిరింది అనేలా ఉంది. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.   




Related Post

సినిమా స‌మీక్ష