పాలకొల్లు కోసం బన్ని హామి

January 16, 2019


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత త్రివిక్రం తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అయితే ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తుంది. ఇదిలాఉంటే ప్రస్తుతం ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేస్తున్న బన్ని సంక్రాంతి వేడుకలను సొంత ఊరు పాలకొల్లులో జరుపుకున్నారు. కుటుంబసమేతగా పాలకొల్లు వెళ్లిన బన్నికి అభిమానులు ఘనస్వాగతం పలికారు.

అభిమానులతో చాలాసేపు మాట్లాడిన బన్ని పాలకొల్లులో కళ్యాణ మండపం కట్టిస్తా అని హామి ఇచ్చాడు. అభిమాన హీరో రావడమే కాదు ఊరి కోసం ఫంక్షన్ హాల్ కట్టిస్తా అనడం ఆ ఊరి ప్రజలకు పండుగ సంతోషం రెట్టింపు అయ్యిందని చెప్పొచ్చు. తాత అల్లు రామలింగయ్య విగ్రహం దగ్గర కూడా అల్లు అర్జున్ అభిమానులతో ఎక్కువసేపు గడిపినట్టు తెలుస్తుంది. అయితే ఫ్యాన్స్ మాత్రం బన్నిని త్వరగా సినిమాలు చేయమని అడిగారట.


Related Post

సినిమా స‌మీక్ష