వినయ విధేయ రామ రివ్యూ & రేటింగ్

January 11, 2019


img

రేటింగ్ : 2/5

మెగా పవర్ స్టార్ రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

అనాథలైన నలుగురు పిల్లలకు మరో పిల్లాడి దొరుకుతాడు. వారంతా కలిసి అన్నదమ్ములుగా పెరుగుతారు. ఓ డాక్టర్ సహాయంతో చిన్నోడు చదువుతుంటాడు. అయితే నలుగురిని ఓ రౌడీ గ్యాంగ్ ఎటాక్ చేస్తుంది. దానితో చిన్నోడు వాడిపై విరుచుకు పడతాడు. అప్పటి నుండి చిన్నోడు చదువు మానేసి అన్నలకు రక్షణగా ఉంటాడు. అయితే అలా పెరిగిన వారనా పెద్ద ఫ్యామిలీ అవుతారు. రామ్ కొణిదెల (రాం చరణ్) తన పెద్దన్నయ్య భువన్ కుమార్ (ప్రశాంత్) మిగతా అన్నదమ్ములు అంతా సరదాగా గడుపుతుంటారు. ఎలక్షన్ కమీషన్ లో పనిచేసే భువన్ కుమార్ వైజాగ్ బై పోల్స్ అధికారిగా ఉంటాడు. అక్కడ నుండి అతన్ని బీహార్ ఎన్నికలకు ట్రాన్స్ ఫర్ చేస్తారు. బీహార్ లో ఓ ఏరియాలో రాజా భాయ్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమా ఎన్నికలేమి లేకుండా చేయాలని చూస్తాడు. ఆ క్రమంలో ఐ.ఏ.ఎస్ భువన్ కుమార్ ను చంపేస్తాడు. అప్పుడు రాం ఏం చేశాడు..? రాజా భాయ్ రాం ఎలా ఢీ కొట్టారు..? రాజా భాయ్ ను ఎలా మట్టుపెట్టాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

ట్రైలర్ తోనే హైల్ ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అనిపించిన వినయ విధేయ రామ సినిమా కేవలం యాక్షన్ పార్ట్ మీదే దృష్టి పెట్టి కథ, కథనాలను పక్కన పెట్టినట్టు ఉన్నారు. బోయపాటికి ఇలాంటి ఊర మాస్ సినిమాలు అలవాటే కాని ఇలా అడ్డదిడ్డంగా తలతోక లేని కథతో ఈ సినిమా చేసి చెడగొట్టాడు. 

అంతేకాదు రొటీన్ స్టోరీ అంతే రొటీన్ స్క్రీన్ ప్లేతో ఆడియెన్స్ ను నిరాశపరచాడు. మొదటి పార్టు పర్వాలేదు అనిపించగా సెకండ్ హాఫ్ దారుణంగా చేశాడు. సెకండ్ హాఫ్ మొత్తం అరాచకాలే. గాల్లో తలకాయలు లెగడం.. ట్రైన్ మీద నిలబడి వైజాగ్ నుండి హీరో బీహార్ రావడం లాంటివి సినిమాను పక్కదారి పట్టించాయి. 

మొత్తానికి తెలిసిన కథను కనీసం తెలిసిన విధంగా స్క్రీన్ ప్లే రాసుకున్నా బాగుండేది. కాని అసలేమాత్రం అర్ధం కాకుండా కన్ ఫ్యూజ్ గా స్క్రీన్ ప్లే రాసుకుని సినిమాను పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యేలా చేశాడు బోయపాటి శ్రీను. మెగా ఫ్యాన్స్ కు రాం చరణ్ నటన, యాక్షన్, డ్యాన్స్ నచ్చే అవకాశం ఉంది తప్ప సగటు సిని అభ్హిమాని మాత్రం సినిమా చూసే ఆస్కారం లేదు.  

నటన, సాంకేతిక వర్గం :

రాం చరణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. రామ్ పాత్రలో రాం చరణ్ అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్ లో సూపర్బ్ గా చేశాడు. ఇక కియరా అద్వాని ఉన్నంతవరకు బాగానే చేసింది. అంతగా ప్రాధాన్య ఉన్న పాత్ర అయితే కాదు. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా పెద్దగా కనిపించలేదు. విలన్ గా వివేక్ ఓబేరాయ్ బిల్డప్ బాగుంది. కాని ఆ క్యారక్టర్ రాసుకున్న విధానం ఫినిష్ చేసిన విధానం బాగాలేదు. నటన పరంగా వివేక్ ఓకే అనిపించాడు. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, మిగతా ఇద్దరు బ్రదర్స్ సోసోగానే చేశారు. వదినగా స్నేహ చివర్లో భారీ డైలాగ్స్ కొడుతుంది. పెద్దగా సూట్ అవలేదని చెప్పాలి. చలపతి రావు సహజ నటనతో మెప్పించాడు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. సినిమాకు మ్యూజిక్ అందించిన దేవి రొటీన్ పాటలే ఇచ్చాడు. ఆన్ స్క్రీన్ జస్ట్ ఓకే అనిపించాయి. బిజిఎం పర్వాలేదు. రిషి పంజాబి, ఆర్ధర్ విల్సన్ సినిమాటోగ్రఫీ బాగానే చేశారు. సినిమాలో చరణ్ లుక్ బాగుంది. ఎడిటింగ్ జాగ్రత్త పడాల్సింది. అక్కడక్కడ కన్ ఫ్యూజ్ గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బగున్నాయి. కథ రొటీన్ గానే రాసుకున్న బోయపాటి కనీసం కథనం అయినా కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తే బాగుండేది. స్క్రీన్ ప్లే దారుణంగా చెడగొట్టింది. బోయపాటి ఇన్నేళ్ల కెరియర్ లో దర్శకుడిగా ఫెయిల్ అయ్యింది ఇదే మొదటిసారని చెప్పొచ్చు.

ఒక్కమాటలో :

వినయ విధేయ రామ.. ఇది మరో దమ్ము సినిమా..! 




Related Post

సినిమా స‌మీక్ష