వెంకటేష్ తో వరుణ్.. రెండు సార్లు మిస్సయ్యాడట

January 11, 2019


img

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించారు. శనివారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ వెంకీతో తను రెండుసార్లు నటించే ఛాన్స్ మిస్సయినట్టు చెప్పుకొచ్చాడు.

వెంకటేష్ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ అల్లరి పిల్లాడుగా ఓ పాత్ర ఉంటుంది. ఆ రోల్ లో ముందు వరుణ్ తేజ్ ను అనుకున్నారట కాని వరుణ్ తేజ్ నటించడం కుదరలేదు. ఇక ఆ తర్వాత వెంకటేష్ వాసు సినిమాలో కూడా వెంకీ తమ్ముడుగా ఛాన్స్ వచ్చినా వరుణ్ ఆ టైంలో బొద్దుగా ఉండటం వల్ల ఛాన్స్ మిస్సయ్యాడట. అలా మొత్తానికి రెండు సార్లు ఛాన్స్ మిస్సైనా ఈసారి వెంకీతో కలిసి చేసే అవకాశం దక్కించుకున్నాడు వరుణ్ తేజ్. మెగా హీరోల్లో సినిమా సినిమాకు కొత్త ప్రయత్నాలు చేస్తున్న వరుణ్ తేజ్ అంతరిక్షం ఫ్లాప్ అవడంతో ఎఫ్-2 మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. Related Post

సినిమా స‌మీక్ష