పేట రివ్యూ & రేటింగ్

January 10, 2019


img

రేటింగ్ : 2/5

సూపర్ స్టార్ రజినికాత్ హీరోగా కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మించిన సినిమా పేట. తెలుగు, తమిళ భాషల్లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో రజినితో పాటుగా త్రిష, సిమ్రన్ లు నటించారు. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ : 

హాస్టల్ వార్డన్ గా ఉంటున్న కాళి (రజినికాంత్) కాలేజ్ ఉన్న ఓ గ్యాంగ్ ను సరిచేసే క్రమంలో అక్కడ ఓ ప్రేమ జంటకు సపోర్ట్ గా ఉంటాడు. అక్కడ ఓ స్టూడెంట్ మదర్ తో స్నేహం చేస్తున్న కాళి మీద ఓ ఎటాక్ జరుగుతుంది. తను సహాయం చేస్తున్న కుర్రాడు అన్వర్ కోసమే కాళిగా అక్కడకు వచ్చాడని. అతని అసలు పేరు పెట్ట వీరా అని తెలుస్తుంది. ఇంతకీ పెట్ట వీర ఎవరు..? ఎందుకు కాళిగా పేరు మార్చుకున్నాడు..? తన శత్రువులను కాళి అలియాస్ పెట్ట వీర ఎలా మట్టుపెట్టాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ : 

పిజ్జా, జిగరుతండా సినిమాలను చేసిన కార్తిక్ సుబ్బరాజు రజినితో సినిమా అనగానే అంచనాలు పెరిగాయి. కొత్త కథతో రజినిని చూపిస్తాడని ఆశించిన ప్రేక్షకులకు నిరాశ మిగిలింది. పరమ రొటీన్ సబ్జెక్ట్ తో అంతే పరమ రొటీన్ స్క్రీన్ ప్లేతో సినిమా చేశాడు కార్తిక్. 90ల్లో రజిని స్టైల్ చూసి ఆయనకు ఫ్యాన్ అయిన కార్తిక్ అలాంటి రజినిని మరోసరి చూపించాలని అలాంటి కథతో వచ్చినట్టు ఉన్నాడు.

సినిమా ఎక్కడ కొత్తదనం కనిపించదు. రజిని స్టైలిష్ లుక్, డైలాగ్స్ తప్ప సినిమాలో ఏమి లేదు. మొదటి భాగం ఏదో అలా నడిచింది అనుకుంటుండగా రెండో భాగం మరీ ఆడియెన్స్ పేషెన్సీకి టెస్ట్ పెడుతుంది. ఇక తమిళంలో ఏమో కాని తమిళ నేటివిటీ ఎక్కువవడం వల్ల మన ఆడియెన్స్ కు రుచించదు.

ఫైనల్ గా యువ దర్శకుడు.. సూపర్ స్టార్ లాంటి హీరో ఛాన్స్ ఇస్తే కొత్త కథతో చేస్తే బాగుండేది. రజిని ఆల్రెడీ చేసిన సబ్జెక్ట్ తోనే వచ్చి నిరాశ పరచాడు. సినిమా అసలు ఏమాత్రం ఆకట్టుకోలేని విధంగా ఉంది. 

నటన, సాంకేతికవర్గం :

రజినికాంత్ స్టైల్ మాత్రం అదిరిపోయింది. పేటలో ఏదైనా బాగుంది అంటే అది కేవలం రజిని స్టైల్ మాత్రమే. ఇక ఈ సినిమాలో సిమ్రాన్ తో పాటుగా త్రిష సోసోగానే అనిపించారు. శహి కుమార్ పాత్ర జస్ట్ ఒకే. విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్ సిద్ధిఖి వంటి వారు కూడా పెద్దగా మెప్పించలేదు. 

టెక్నికల్ టీం విషయానికొస్తే.. తిరు సినిమాటోగ్రఫీ బాగుంది. స్నిమాలో రజిని స్టైల్ తర్వాత ఏదైనా బాగుంది అంటే అది అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్. సినిమాకు తను ఇచ్చిన బిజిఎం అలరిస్తుంది. డైరక్టర్ కార్తిక్ సుబ్బరాజు రొటీన్ గా సినిమా నడిపించాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ వరకు బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బగున్నాయి.

ఒక్కమాటలో :

రజినికాంత్ పేట.. పరమ రొటీ సినిమా..!



Related Post

సినిమా స‌మీక్ష