6 షోలతో వినయ విధేయ రామ హంగామా..!

January 08, 2019


img

సంక్రాంతి సినిమా పండుగ సందర్భంగా మూడు భారీ సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. అందులో ఒకటి రేపు అనగా జనవరి 9, బుధవారం ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు రిలీజ్ అవుతుండగా 11న శుక్రవారం రాం చరణ్ వినయ విధేయ రామ, 12న వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ ఎఫ్-2 రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల హంగామాతో ఆడియెన్స్ సంక్రాంతి మరింత సంబరాలు జరుపుకునేలా ఉన్నారు.

ఇక సంక్రాంతి సినిమాల బరిలో ప్రెస్టిజియస్ మూవీగా వస్తున్న మూవీ వినయ విధేయ రామ. బోయపాటి డైరక్షన్ లో చరణ్ నటించిన ఈ మూవీ హైల్ ఓల్టెజ్ యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్ కూడా భారీగా ఉండటంతో ఏపిలో ఈ మూవీకి స్పెషల్ షోలకు పర్మిషన్ తీసుకున్నారు. ఏపి ప్రభుత్వం వివి ఆర్ కు రోజు పడే నాలుగు షోలే కాకుండా మరో రెండు అదనపు షోలకు పర్మిషన్ ఇచ్చారు. జనవరి 11 నుండి 19 వరకు 9 రోజులు ఏపిలో వినయ విధేయ రామ 6 షోలు ప్రదర్శితమవుతాయి. రంగస్థలం తర్వాత రాం చరణ్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా ఆ అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష