త్రివిక్రం.. సునీల్.. స్నేహం కోసం

January 08, 2019


img

కమెడియన్ నుండి హీరోగా టర్న్ తీసుకుని ఈ కాంపిటీషన్ లో నెగ్గడం కష్టమని భావించి మళ్లీ చిన్నగా కామెడీ రోల్స్ చేస్తున్నాడు సునీల్. లాస్ట్ ఇయర్ వచ్చిన అరవింద సమేత సినిమాలో నీలాంబరి పాత్రలో నటించి మెప్పించాడు సునీల్. త్రివిక్రం డైరక్షన్ లో కమెడియన్ గా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ మళ్లీ త్రివిక్రం సినిమాతో మరో ఛాన్స్ కూడా కొట్టేశాడట.

త్రివిక్రం అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా ఓ ప్రాజెక్ట్ కన్ఫాం అయ్యింది. హారిక హాసిని బ్యానర్ తో పాటుగా ఈ సినిమా నిర్మాణంలో గీతా ఆర్ట్స్ కూడా భాగస్వామ్యం అవుతుంది. ఈ మూవీలో సునీల్ కు మరో సర్ ప్రైజ్ రోల్ ప్లాన్ చేశాడట త్రివిక్రం. స్నేహితుడి కెరియర్ మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చే బాధ్యత మీద వేసుకున్న త్రివిక్రం సునీల్ కు మరో బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి బన్ని, త్రివిక్రం సునీల్ కెరియర్ కు ఏమాత్రం బూస్టప్ ఇస్తారో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష