దసరాకే సైరా ఫిక్స్..!

January 08, 2019


img

ఖైది నంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. తను నటించిన వినయ విధేయ రామ రిలీజ్ ప్రమోషన్స్ లో సైరాకు సంబందించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా బయటపెట్టాడు రాం చరణ్. ఇన్నాళ్లు సైరా బడ్జెట్ 150 నుండి 200 కోట్ల మధ్యలో పెడుతున్నారని అనుకున్నాం కాని చరణ్ 250 కోట్ల బడ్జెట్ తో సైరా తెరకెక్కుతుందని అన్నారు.

ఇక ఈ సినిమా నాన్నకు అమ్మ కానుకగా ఇవ్వాలని కోరింది. అందుకే బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవలేదని అంటున్నాడు చరణ్. పిరియాడికల్ మూవీ కాబట్టి ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది. సినిమాను ముందు సమ్మర్ రిలీజ్ అనుకున్నా అది కాస్త లేట్ అయ్యేలా ఉంది. సైరా సినిమాను దసరాకి రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు చెప్పుకొచ్చాడు రాం చరణ్. అదే నిజమైతే దసరా రేసులో మిగతా సినిమాలు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. Related Post

సినిమా స‌మీక్ష