నాగబాబు కామెంట్స్ కు వర్మ రియాక్షన్..!

January 08, 2019


img

మెగా బ్రదర్ నాగబాబు నందమూరి బాలకృష్ణ మీద వరుసగా కామెంట్స్ చేస్తున్నాడు. రెండు రోజులుగా ఉదయం 9 గంటలకు ఒక వీడియో రాత్రి 9 గంటలకు మరో వీడియో రిలీజ్ చేస్తూ నాగబాబు బాలకృష్ణ మీద విమర్శనాస్త్రాలు సంధించాడు. గత కొన్నాళ్లుగా బాలకృష్ణ మెగా ఫ్యామిలీ మీద, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద అన్న మాటలను గుర్తుచేస్తూ నాగబాబు బాలకృష్ణని ఎటాక్ చేయడం జరిగింది.

ఈరోజు ఉదయం కూడా అలగా జలగం అంటూ బాలకృష్ణ మాట్లాడిన తీరుని తప్పుపట్టాడు నాగబాబు. ఇక నాగబాబు ఈ కామెంట్స్ పై స్పందించాల్సిన బాలకృష్ణ సైలెంట్ గా ఉండగా సంచలన దర్శకుడు ఆర్జివి మాత్రం ట్వీట్ ద్వారా రెస్పాండ్ అయ్యాడు. కామెంట్స్ చేయడం లో నన్ను మించిపోయారనే నా బాధ, మీ బ్రదర్స్ ను సమర్ధించడంలో సూపర్ స్టార్ గా మారాడన్న సంతోషం. ఒక కంట కన్నీరు.. మరోకంట పన్నీరు అంటూ వర్మ ట్వీట్ చేశాడు. అంతేకాదు హ్యాట్సాఫ్ నాగబాబు గారు మీ బ్రదర్స్ మీద మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో మాకు అంతే ప్రేమ ఉంది అంటూ వర్మ రియాక్ట్ అవడం విశేషం. Related Post

సినిమా స‌మీక్ష