వైఎస్సార్ 'యాత్ర' ట్రైలర్.. మాట ఇచ్చాక ముందుకెళ్లాల్సిందే..!

January 07, 2019


img

వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా ఆయన చేసిన పాదయాత్ర నేపథ్యంతో వస్తున్న సినిమా యాత్ర. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. వై.ఎస్.ఆర్ గా మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్న యాత్ర సినిమా ట్రైలర్ అంచనాలకు మించి ఉందని చెప్పొచ్చు. 

నా విధేయతని.. విశ్వాసాన్ని.. బలహీనతగా తీసుకోవద్దండి.. నాయకుడిగా మనకేం కావాలో తెలుసుకోగలిగాం కాని.. జనాలకి ఏం కావాలో తెలుసుకోలేక పోయాం.. తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడపదాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది అంటూ చెప్పిన డైలాగ్ వైఎస్ అభిమానులను అలరిస్తున్నాయి. వైఎస్సార్ గా మమ్ముట్టి పర్ఫెక్ట్ గా సూటయ్యారు. మహానేతగా ఎన్నో కోట్ల హృదయాలను గెలిచిన వైఎస్సార్ జ్ఞాపకాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఈ యాత్ర సినిమా కూడా అందరిని అలరిస్తుందని భావిస్తున్నారు. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవి రెడ్డి నిర్మించిన యాత్రం మూవీ ఫిబ్రవరి 8న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.    

Related Post

సినిమా స‌మీక్ష