100 కోట్ల శాండల్ వుడ్..!

January 07, 2019


img

టైటిల్ చూసి కచ్చితంగా ఇదేదో తక్కువ టైంలో శాండల్ వుడ్ లో సినిమా కలెక్ట్ చేసిన కలక్షన్స్ అనుకోవచ్చు. అయితే ఇది సినిమా వాళ్లకు సంబందించిన ఫిగరే కాని సినిమా వసూళ్లు కాదు కన్నడ సినిమా పరిశ్రమలో ఐటి అధికారులు చేసిన దాడుల్లో స్వాధీనం చేస్తున్న మొత్తం. కర్ణాటక సూపర్ స్టార్స్ పునీత్ రాజ్ కుమార్, శివ రాజ్ కుమార్, యశ్, సుదీప్, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఇళ్ల మీద ఐటి అధికారులు అనూహ్య రైడ్ నిర్వహించారు.   

మూడు రోజులు 30 స్థానాల్లో 180 మంది అధికారులు స్టార్స్ మీద ఐటి దాడులు చేశారు. ఈ గాడుల్లో 109 కోట్ల రూపాయల డబ్బు, 25 కేజిల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం తాము ఎలాంటి తప్పు చేయలేదని స్టార్స్ ప్రకటించారు. అయితే ఆడియో రైట్స్, ఇంటర్నెట్ రైట్స్, కలక్షన్స్ వంటి వాటిల్లో అక్రమాలు జరిగినట్టు ఐటి అధికారులు గుర్తించారు. ప్రస్తుతం సౌత్ సిని వర్గాల్లో ఈ ఐటి దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈమధ్యనే కొద్దిగా మార్కెట్ పెంచుకున్న కన్నడ స్టార్స్ దగ్గరే అంత మొత్తం ఉంటే టాలీవుడ్ స్టార్స్ దగ్గర ఇంకెంత ఉంటుందో అని లెక్కలేసుకుంటున్నారు. Related Post

సినిమా స‌మీక్ష