రజిని సినిమాకు థియేటర్స్ కరువు.. నిర్మాత లబోదిబో..!

January 07, 2019


img

ఈ సంక్రాంతి బరిలో బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్, రాం చరణ్ వినయ విధేయ రామ, వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ఎఫ్-2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటుగా సూపర్ స్టార్ రజినికాంత్ పేట సినిమా కూడా రిలీజ్ అవుతుంది. కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా రజిని భాషా తరహాలో ఉంటుందని తెలుస్తుంది. తమిళంతో పాటుగా తెలుగులో కూడా పేట సినిమా జనవరి 10న రిలీజ్ ప్లాన్ చేశారు. అనువాద చిత్రాల నిర్మాత అశోక్ వళ్లభనేని పేట సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజిని సినిమాకు థియేటర్లు దొరకడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు అశోక్.  

ఈమధ్య తమిళ సినిమాలైన నవాబ్, సర్కార్ సినిమాలను తెలుగులో అశోక్ రిలీజ్ చేశారు.. అయితే అప్పుడు రాని థియేటర్ల సమస్య ఇప్పుడే వచ్చిందా అంటూ ఆయన మాటలను తిప్పికొడుతున్నారు. సంక్రాంతి అంటే సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఇలాంటి టైంలో ఓ డబ్బింగ్ సినిమా తెచ్చి రిలీజ్ చేయడం.. దానికి థియేటర్లు దొరకడం లేదని ఫైర్ అవడం అశోక్ మీద తిరిగి రివర్స్ కౌంటర్ పడేలా చేస్తున్నాయి. టాలీవుడ్ లో థియేటర్ మాఫియా ముగ్గురు నలుగురు చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయన్న కామెంట్లు ఎప్పటి నుండో వినిపిస్తున్నాయి..  కాని ఏదో వారిని మేనేజ్ చేసి థియేటర్లు ఇప్పించుకోవాలి తప్ప ఇలా వారిని వ్యతిరేకించి ఏం సాధిస్తారన్నది హాట్ న్యూస్ గా మారింది.      

రజిని సినిమాకు తెలుగులో కూడా భారీ క్రేజ్ ఉంటుంది. కాని సంక్రాంతికి ఆల్రెడీ మన స్టార్స్ సినిమాలు ఉన్నప్పుడు రజిని సినిమాకు ఇబ్బందులు తప్పవు. అశోక్ మాటల ప్రస్థావనలో అల్లు అరవింద్, యువి క్రియేషన్స్, దిల్ రాజు వంటి బడా నిర్మాతల పేరు వినిపించాయి. నయీంను అంతం చేసినట్టు థియేటర్ మాఫియాను అంతం చేయాలని కె.సి.ఆర్ ను సూచించారు అశోల్ వళ్లభనేని. పేట ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అశోల్ వళ్లభనేనిపై ప్రస్థావించబడిన ఆ బడా నిర్మాతలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.  



Related Post

సినిమా స‌మీక్ష