త్రివిక్రంతో బన్ని ఆరోజు మొదలుపెడతాడట..!

January 07, 2019


img

నా పేరు సూర్య ఊహించని విధంగా షాక్ ఇవ్వడంతో ఈసారి చేసే సినిమా సూపర్ హిట్ కొట్టాల్సిందే అనేంత కసితో ఉన్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. విక్రం కుమర్, పరశురాం వంటి దర్శకులతో సినిమా ఉంటుందని వార్తలు రాగా ఫైనల్ గా త్రివిక్రం తో సినిమా షురూ చేశాడు బన్ని. ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ న్యూ ఇయర్ నాడు వచ్చింది.

ఇదిలాఉంటే ఈ సినిమా ముహుర్తం ఎప్పుడు అని మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రేమికుల రోజు అంటే ఫిబ్రవరి 14న ఈ కాంబినేషన్ సినిమా ముహుర్తం పెట్టనున్నారట. త్రివిక్రం తో బన్ని ఆల్రెడీ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. అయితే ఈసారి ఇద్దరు కలిసి బ్లాక్ బస్టర్ మీద కన్నేసినట్టు తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష