మెగాస్టార్ బిగ్ బాస్ అవుతాడా..!

January 05, 2019


img

స్టార్ హీరోలు ఇప్పుడు బుల్లితెర మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. భారీ బడ్జెట్ రియాలిటీ షోలు వస్తున్న ఈ తరుణంలో స్మాల్ స్క్రీన్ పై కూడా తమ టాలెంట్ చూపించాలని ఉత్సాహపడుతున్నారు. ఆల్రెడీ బాలీవుడ్ లో బిగ్ బాస్ కోసం సల్మాన్ ఖాన్ తన షెడ్యూల్ లో బుల్లితెరకు కొంత టైం కేటాయించాడు. ఇక తెలుగులో కూడా కింగ్ నాగార్జున నుండి నాచురల్ స్టార్ నాని వరకు స్మాల్ స్క్రీన్ పై స్క్రీన్ టెస్ట్ చేసుకున్నారు.

మీలో ఎవరు కోటీశ్వరుడు రెండు సీజన్స్ లో నాగ్ అలరించగా 3వ సీజన్ కోసం మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ కోసం ఎన్.టి.ఆర్ ను తీసుకొచ్చారు స్టార్ మా వారు. యాంకర్ గా కూడా ఎన్.టి.ఆర్ తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ చేయగా సెకండ్ సీజన్ నాని మెప్పించాడు. ఇక ఇప్పుడు 3వ సీజన్ కు ముహుర్తం పెట్టేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 అసలైతే ఎన్.టి.ఆర్ ను మళ్లీ రప్పిస్తారని అనుకున్నారు. కాని ట్రిపుల్ ఆర్ కోసం ఎన్.టి.ఆర్ బ్లాక్ అయ్యాడు అందుకే బిగ్ బాస్ కోసం మెగాస్టార్ ను అడుగుతున్నారట. ఎం.ఈ.కే మూడవ సీజన్ లో బుల్లితెర మీద తన లక్ టెస్ట్ చేసుకున్నాడు చిరంజీవి. కాని ఆశించిన స్థాయిలో మెప్పించలేదని చెప్పొచ్చు. అదీగా సైరాతో పాటుగా కొరటాల శివ సినిమా కూడా ఉంది కాబట్టి బిగ్ బాస్ హోస్ట్ గ్ చిరంజీవి చేస్తాడన్న వార్తలన్ని ఉత్తుత్తే అన్నమాట. మరి ఈసారి హోస్ట్ గా ఎవర్ని తీసుకొస్తారో చూడాలి. చిరు తర్వాత విక్టరీ వెంకటేష్ కూడా హోస్ట్ గా చేసే అవకాశం ఉందని అంటున్నారు.     Related Post

సినిమా స‌మీక్ష