కీరవాణి నోరు జారాడు

January 05, 2019


img

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి డైరక్టర్ రాజమౌళితో చేసిన అద్భుతాలు అందరికి తెలిసిందే. బాహుబలి సినిమా అంత పెద్ద విజయాన్ని అందుకుంది అంటే అందులో కీరవాణి మ్యూజిక్ ఎఫర్ట్ చాలానే ఉంది. రీసెంట్ గా ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాకు మ్యూజిక్ అందించిన కీరవాణి ఆ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో ట్రిపుల్ ఆర్ గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు లీక్ చేశాడు. 

ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎనౌన్స్ చేసిన నాటి నుండి ఇదో పిరియాడికల్ మూవీ అని.. 1930 కాలంలో జరిగే కథ అని లీకులు వచ్చాయి. 1930తో పాటుగా 2019 నాటి పరిస్థితులు సినిమాలో ఉంటాయట. అంటే మగధీర సినిమాలో లా గతజన్మ తరహాలో అన్నమాట. అయితే ఈ సినిమా కథ మీద కొద్దిగా డౌట్ ఉండేది కాని కీరవాణి మాటల్లో మాటగా పిరియాడికల్ ట్యూన్స్ తో పాటుగా నేటి ట్రెండ్ కు తగినట్టుగా ఆ సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలని అన్నాడు. మార్చ్ 2019 నుండి ఆర్.ఆర్.ఆర్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఉంటాయని చెప్పాడు. కీరవాణి చెప్పిన దానిబట్టి చూస్తే పిరియాడికల్ డ్రామాగా ట్రిపుల్ ఆర్ ఫిక్స్ అయిపోవచ్చు.Related Post

సినిమా స‌మీక్ష