అర్జున్ రెడ్డి తర్వాత గీత గోవిందం

January 05, 2019


img

విజయ్ దేవరకొండ నటించిన సినిమాలకు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడిందా అంటే అవుననే చెప్పుకోవాలి. విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఇప్పటికే అక్కడ కబీర్ సింగ్ గా రీమేక్ అవుతుంది. మాత్రుక దర్శకుడు సందీప్ వంగ డైరక్షన్ లో షాహిద్ కపూర్, కియరా అద్వాని కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది.


పరశురాం డైరక్షన్ లో విజయ్, రష్మిక కలిసి నటించిన సినిమా గీతా గోవిందం. రిలీజ్ ముందు లీకుల బారిన పడిన ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దేవరకొండ విజయ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. గీతా గోవిందం తర్వాత నోటా వచ్చి ఫ్లాప్ అవగా టాక్సీవాలా మళ్లీ రౌడీ హీరోకి హిట్ ఇచ్చింది. ఇక బాలీవుడ్ గీతా గోవిందంలో దఢక్ హీరో ఇషాన్ కట్టర్ లీడ్ రోల్ చేస్తున్నాడు. బాలీవుడ్ గీతా గోవిందం సినిమాను ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుందట అయితే దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమా నిర్మించారు.Related Post

సినిమా స‌మీక్ష