రాజమౌళి.. రజినికాంత్.. అదిరిపోయే కాంబో..!

January 05, 2019


img

సూపర్ స్టార్ రజినికాంత్ 2.ఓ తర్వాత పేట మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో జనవరి 10న రిలీజ్ అవుతుంది. కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా రజిని భాషా తరహా కథలా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ మూవీ తర్వాత రజిని ఏమాత్రం లేటు చేయకుండా మురుగదాస్ తో సినిమా షురూ చేస్తారట. ఆ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుందని తెలిసిందే.

అంతేకాదు మరోసారి కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో సినిమా ఉంటుందట. ఆల్రెడీ చేసిన దర్శకుడితోనే రజిని ఈమధ్య రెండో సినిమా కూడా చేస్తున్నాడు. మురుగదాస్ సినిమా తర్వాత రజిని కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో సినిమానే అంటున్నారు. ఈ రెండిటి తర్వాత రజినికాంత్ రాజమౌళితో సినిమా ప్లానింగ్ చేస్తున్నాడట. బాహుబలి సినిమాతో రాజమౌళి సత్తా ఏంటో దేశం మొత్తం కాదు కాదు ప్రపంచం మొత్తం తెలిసింది. అలాంటి దర్శకుడితో రజిని సినిమా అంటే ఎలా ఉంటుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష