ఆ అరగంట మెగా ఫ్యాన్స్ కు పండగే..!

January 05, 2019


img

రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న వినయ విధేయ రామ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 11న రిలీజ్ కాబోతుంది. రంగస్థలం తర్వాత రాం చరణ్ చేసిన సినిమాగా ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాకు సంబందించి ఓ క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

అయితే సెకండ్ హాఫ్ లో అజర్ బైజాన్ లో షూట్ చేసిన ఎపిసోడ్స్ మాత్రం మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉంటాయని తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ అరగంట పాటు ఎవరు సీట్లలో కూర్చోరని చెబుతున్నారు చిత్రయూనిట్. యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న వినయ విధేయ రామ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తుండగా.. కియరా అద్వాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.Related Post

సినిమా స‌మీక్ష