అర్జున్ రెడ్డి మీద మనసుపడ్డ కియరా..!

January 04, 2019


img

యువ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. వారిలో స్టార్ హీరోలే కాదు స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారని తెలిసిందే. వారిలో ఒకరు కియరా అద్వాని ఎమ్మెస్ ధోని బయోపిక్ లో నటించి మెప్పించిన కియరా సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా హిట్ తో రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది.

అర్జున్ రెడ్డి సినిమా చూశాక విజయ్ దేవరకొండ సినిమాకు అభిమానిగా మారానని వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్స్ లో చెప్పింది కియరా. మహేష్, నమ్రత.. చరణ్, ఉపాసన తనని ఎంతో ప్రేమగా చూసుకున్నారని ఓ కుటుంబంగా వారు తనకి సపోర్ట్ గా నిలిచారని చెప్పుకొచ్చింది కియరా అద్వాని. అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ గా వస్తున్న కబీర్ సింగ్ లో కియరా నటిస్తుంది. సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.Related Post

సినిమా స‌మీక్ష