ఒకే రోజున ఇద్దరు స్టార్స్.. కోలీవుడ్ లో బిగ్ ఫైట్..!

December 14, 2018


img

సంక్రాంతి వచ్చింది అంటే సినిమాల సందడి ఉండాల్సిందే. సంక్రాంతి పందెం కోళ్లుగా తమ సత్తా చాటేందుకు స్టార్స్ వస్తుంటారు. 2019 సంక్రాంతికి తెలుగులో 3 పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ తో పాటుగా రామ్ చరణ్ వినయ విధేయ రామ ఇంకా వెంకటేష్, వరుణ్ తేజ్ చేస్తున్న ఎఫ్-2. 3 సినిమాలు సంక్రాంతికి సీజన్ కు రిలీజ్ అవుతున్నా రిలీజ్ డేట్లు మాత్రం వేరుగా ఉన్నాయి.  

ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే కోలీవుడ్ లో మాత్రం వేరేలా ఉంది. జనవరి 10న రెండు పెద్ద సినిమాలు రిలీజ్ ప్లాన్ చేశాయి. అందులో ఒకటి సూపర్ స్టార్ రజినికాంత్ పెట్ట కాగా.. మరోటి తల అజిత్ విశ్వాసం. ఒకరిని ముందుకు మరొకరిని వెనక్కి చెప్పలేని పరిస్థితి అట. ఆల్రెడీ నడిఘర్ సంఘం తరపున విశాల్ రెండు సినిమాల నిర్మాతలతో మాట్లాడినా ప్రయోజనం లేదని తెలుస్తుంది.   

కోలీవుడ్ లో రజినికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే అజిత్ తక్కువోడేం కాదు.. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. హీరోలు, దర్శక నిర్మాతలు బాగానే ఉన్నారు కాని ఈ రెండు సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం కిందా మీద పడుతున్నారు. ఇక ఈ సినిమాలు తెలుగు వర్షన్ గురించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తెలుగులో వచ్చినా పండుగ సీజన్ తెలుగు సినిమాలకే ఆడియెన్స్ ప్రిఫరెన్స్ ఇస్తారని తెలిసిందే. 



Related Post

సినిమా స‌మీక్ష