పడి పడి లేచే మనసు ట్రైలర్.. పడరేమో టెన్షన్ పడకండి పడేసే బాధ్యత నాదే..!

December 14, 2018


img

శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. యూత్ ఆడియెన్స్ టార్గెట్ తో వస్తున్న ఈ పడి పడి లేచే మనసు సినిమా పక్కా హిట్ అనేలా ఈ ట్రైలర్ ఉంది.

లై తో అంచనాలు తప్పిన హను రాఘవపుడి పర్ఫెక్ట్ స్కేల్ లో తెరకెక్కించిన సినిమాగా ఈ మూవీ వస్తుంది. కథ రొటీన్ గా అనిపిస్తున్నా స్క్రీన్ ప్లే, శర్వానంద్, సాయి పల్లవిల స్క్రీన్ ప్రెజెన్స్ మెప్పించేలా ఉందని చెప్పొచ్చు. విశాల్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక సినిమాలో డైలాగ్స్ బాగున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. హలో మేడం పడరేమో టెన్షన్ పడకండి పడేసే బదహ్యత నాదే అంటూ బైక్ మీద వెళ్తూ అలా ఫినిషింగ్ టచ్ ఇచ్చిన శర్వానంద్ అదరగొట్టాడు.  

డిసెంబర్ 21న ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు పోటీగా వరుణ్ తేజ్ అంతరిక్షం, కన్నడ యశ్ హీరోగా వస్తున్న కె.జి.ఎఫ్ రిలీజ్ అవుతున్నాయి. ట్రైలర్ ఇంప్రెస్ చేయగా పడి పడి లేచే మనసు శర్వానంద్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.




Related Post

సినిమా స‌మీక్ష