అల్లు శిరీష్ 'జాతి రత్నం'

December 13, 2018


img

మెగా ఫ్యామిలీ నుండి వచ్చి ఇంకా హీరోగా ప్రూవ్ చేసుకోలేదని చెప్పాల్సి వస్తే అది ఒక్క అల్లు శిరీష్ అనే చెప్పొచ్చు. గౌరవం నుండి ఒక్క క్షణం వరకు సినిమాలైతే చేస్తున్నాడు కాని ఈ అల్లు హీరోకి బ్రేక్ మాత్రం రావట్లేదు. పరశురాం డైరక్షన్ లో చేసిన శ్రీరస్తు శుభమస్తు కొద్దిగా పర్వాలేదు అనిపించినా మెగా హీరోల రేంజ్ హిట్ అందుకోలేదు. ప్రస్తుతం ఏబిసిడి సినిమా చేస్తున్న అల్లు శిరీష్ ఈ సినిమా తర్వాత మారుతి డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడని తెలుస్తుంది.

ఆల్రెడీ మారుతి కాంబినేషన్ లో కొత్తజంట సినిమా చేశాడు అల్లు శిరీష్. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మహానుభావుడు హిట్ అందుకున్న మారుతి శైలజా రెడ్డి అల్లుడు నిరాశపరచాడు. అయినా సరే మారుతి చెప్పిన కథ నచ్చడంతో శిరీష్ మారుతితో ఫిక్స్ అయ్యాడట. ఈ సినిమా కోసం జాతిరత్నం అని టైటిల్ అనుకుంటున్నారట.   

ఎప్పుడో మూడేళ్ల క్రితమే మారుతి ఈ కథ రాసుకున్నాడు. తీసేందుకు టైం కుదరలేదు. ఫైనల్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో జాతిరత్నం తెరకెక్కుతుంది. మరి మారుతి అయినా అల్లు హీరో కెరియర్ సెట్ చేస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.   Related Post

సినిమా స‌మీక్ష