కొరటాల, చిరంజీవి సినిమాలో చరణ్..?

December 13, 2018


img

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ సినిమా కన్ఫాం చేశాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మీటినీ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. అసలైతే డిసెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉన్నా సైరా లేట్ అవడం వల్ల ఈ సినిమా లేట్ అవుతూ వస్తుంది. కొరటాల శివ ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.   

అయితే ఈ సినిమాలో స్పెషల్ సర్ ప్రైజ్ ఏంటంటే ఓ చిన్న పాత్రలో చరణ్ కూడా కనిపించేలా ప్లాన్ చేశారట. చిరు సినిమాలో చరణ్, చరణ్ సినిమాలో చిరు కెమియో రోల్స్ కామనే.. కాని ఈసారి సినిమాకు అవసరమైన ఓ పాత్రలో కనిపిస్తున్నాడట చరణ్. చిరు, చరణ్ స్క్రీన్ పై మరోసారి మెరిపిస్తారని తెలుస్తుంది.

ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే రంగస్థలం తర్వాత్ అదే రేంజ్ భారీ అంచనాలతో వస్తుంది వినయ విధేయ రామ. ఈ సినిమా తర్వాత ఆర్.ఆర్.ఆర్ ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. 2019 మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే కానుకలు ఇచ్చేలా మెగా హీరోలు ప్రయత్నిస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష