గూగుల్ సెర్చ్ లో ఆమెను అంతగా వెతికారా..!

December 13, 2018


img

మళయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వరియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు అనుకుంటా. ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్ లో తన కనుసైగలతో దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేసిన ఈ అమ్మడు ఆ దెబ్బతో 2 మిలియన్ ఫాలోవర్స్ ను ఏర్పరచుకుంది. ఆ సినిమా రిలీజ్ అవలేదు కాని అమ్మడి గురించి తెలుసుకోవాలనుకునే వారు గూగుల్ లో తెగ వెతికేశారట. అందుకే గూగుల్ 2018 టాప్ ప్లేస్ లో నిలిచింది ప్రియా ప్రకాశ్.

2018 సంవత్సరంలో ఎక్కువగా గూగుల్ లో వెతికిన సెలబ్రిటీ ప్రియా ప్రకాశ్ వరియర్. ఆ తర్వాత స్థానంలో ప్రియాంకా భర్త నిక్ జోనాస్ ఉన్నాడు. 3వ స్థానంలో ప్రముఖ డ్యాన్సర్, బిగ్ బాస్ తో క్రేజ్ తెచ్చుకున్న సప్నా చౌదరి ఉన్నారు. నాలుగవ స్థానంలో ప్రియాంకా, ఐదవ స్థానంలో సోనం కపూర్ భర్త ఆనంద్ ఆహుజా ఉన్నారు. కొన్నాళ్లుగా టాప్ 10లో 1, 2, 3 స్థానాల్లో ఉండే సన్ని లియోన్ ఈసారి టాప్ 10లో స్థానం సంపాదించలేదు. బాలీవుడ్ కెరియర్ కూడా ఆశాజనకంగా లేకపోవడం వల్ల సన్ని వెనుకపడ్డది.  



Related Post

సినిమా స‌మీక్ష