నాని.. దుల్కర్.. దొంగా పోలీస్ ఆట

December 13, 2018


img

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం జెర్సీ సినిమా చేస్తుండగా ఈ సినిమా తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో నాని సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో నానితో పాటుగా మళయాల స్టార్ దిల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడని టాక్. అష్టా చమ్మ, జెంటిల్ మన్ ఇంద్రగంటి, నాని కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి.

ఈ సినిమాలో నాని పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. క్రైం పోలీస్ గా నాని సరికొత్త పాత్రలో దర్శనమిస్తున్నాడట. నాని పోలీస్ అంటే దుల్కర్ సల్మాన్ కచ్చితంగా దొంగే అయ్యుంటాడని.. నాని, దుల్కర్ సల్మాన్ దొంగా పోలీస్ కథతో ఈ మల్టీస్టారర్ వస్తుందని అంటున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ కాబట్టి ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. దేవదాస్ తర్వాత మల్టీస్టారర్స్ వద్దు అనుకున్న నాని ఈ సినిమా చేస్తున్నాడు అంటే కథలో ఎంత విషయం ఉందో అర్ధం చేసుకోవచ్చు.   



Related Post

సినిమా స‌మీక్ష