పెట్టా టీజర్.. రజిని మార్క్ స్టైల్

December 12, 2018


img

సూపర్ స్టార్ రజిని యువ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నాడని చెప్పొచ్చు. 2.ఓ కోసం లేట్ అయినా ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారుతున్నాడు. 2.ఓ ఇంకా థియేటర్స్ లో ఉండగానే తన తర్వాత సినిమా పెట్టా మూవీ టీజర్ తో పలుకరించారు రజినికాంత్. కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా రజిని మాఫియా డాన్ గా కనిపించనున్నాడు. 

అంతేకాదు రజిని ఈ మూవీలో డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. సిమ్రాన్, మేఘా ఆకాష్ సినిమాలో నటిస్తుండగా త్రిష కూడా మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ మూవీ 2019 పొంగల్ వార్ లో దిగుతుంది. ఈ సినిమా తెలుగు వర్షం మీద ఇంకా ఎలాంటి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. అయితే సంక్రాంతికి తెలుగులో భారీ సినిమాలు ఉన్నాయి. మరి వాటి మధ్య పెట్టా వచ్చి నిలబడగలదా అన్నది చూడాలి. 

రజిని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ లో రజిని మార్క్ స్టైలిష్ వాక్ చూపించారు. సినిమా తప్పకుండా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరించేలా ఉంటుందని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతుంది.





Related Post

సినిమా స‌మీక్ష