96 రీమేక్.. 99 ఫిక్స్

December 12, 2018


img

కోలీవుడ్ లో ఈమధ్య విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న సినిమా 96. ప్రేమ్ కుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ మూవీ తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ ప్రయత్నాల్లో ఉన్నారు దిల్ రాజు. అల్లు అర్జున్, నానిలను అడిగితే నో చెప్పగా గోపిచంద్ తో ఈ రీమేక్ చేస్తారని తెలుస్తుంది.  

ఈ మూవీ కన్నడలో కూడా రీమేక్ చేస్తున్నారట. తెలుగులో లేట్ అవుతుండగా కన్నడలో ఆల్రెడీ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 96 సినిమాను అక్కడ 99 గా మార్చారు. కన్నడ స్టార్ గణేష్, భావన అక్కడ జంటగా నటిస్తున్నారు. ప్రీతం గబ్బి డైరెక్ట్ చేస్తున్న 99 సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. తెలుగులో దిల్ రాజు ఇంకా కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.



Related Post

సినిమా స‌మీక్ష