ఒక్క పోస్టర్ వివాదం సృష్టించింది

December 12, 2018


img

సౌత్ గ్లామరస్ హీరోయిన్ హాన్సిక ప్రధాన పాత్రలో వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మహా. జమిల్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో హాన్సిక కాషాయ దుస్తులు ధరించి ధూమపానం చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా వస్తున్న మహా సినిమా ఈ పోస్టర్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు తమిళ ఆడియెన్స్. తమిళ ఆడియెన్స్ రజినికాంత్, విజయ్ లాంటి వారినే సిగరెట్ వెలిగించడం నచ్చదు. 


అలాంటిది హాన్సిక ఇలా సిగరెట్ తాగుతూ సంప్రదాయ దుస్తులలో కనిపించడం వివాదాలు మొదలయ్యాయి. అయితే ఈ పోస్టర్ పై వస్తున్న నెగటివ్ కామెంట్స్ ను చిత్రయూనిట్ ఏమాత్రం పట్టించుకోలేదు. రిలీజ్ చేసిన రెండు పోస్టర్స్ లో హాన్సిక ఒక దానిలో మాస్క్ చేతిలో పట్టుకుని ఉండగా.. మరో పోస్టర్ లో సిగరెట్ తాగుతూ స్టిల్ ఇచ్చింది. మరి ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష