బండ్లన్న ట్వీట్ చేశాడోచ్..!

December 12, 2018


img

నిన్న టి.ఆర్.ఎస్ పార్టీ గెలిచిన 88 సీట్లు సంచలనం కాగా మరోపక్క బండ్ల గణేష్ కాంగ్రెస్ గెలవకపోతే 7'0 క్లాక్ బ్లేడుతో గొంతుకోసుకుంటా అని చెప్పిన ఇంటర్వ్యూ బైట్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అంతేకాదు దీనిపై నెటిజెన్స్ కామెంట్స్, ట్రోల్స్, మీమ్స్ బాగా వచ్చాయి. బండ్ల గణేష్ ఎక్కడా అతనికి 7'0 క్లాక్ బ్లేడ్ దొరకకుండా చేయండి అంటూ హంగామా మొదలైంది.  

రాత్రి కల్లా బండ్ల నుండి ఓ రిప్లై వచ్చింది. ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాం.. ఓటమిని అంగీకరిస్తున్నాం గెలిచిన టి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి అభినందనలు అని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. మరి అప్పుడేమో అంత ఆవేశంగా మాట్లాడిన బండ్లన్న ఇప్పుడు ఇంత సైలెంట్ అయ్యాడేంటో.. నోరు ఉంది కదా అని ఏదో ఒకటి మాట్లాడేసి ఆ తర్వాత నాలుక కరచుకున్నా ఏం లాభం. నిన్న బండ్ల గణేష్ సవాల్ విసిరిన వీడియో వాట్స్ అప్ స్టేటస్ లో దుమ్ముదులిపింది.  


Related Post

సినిమా స‌మీక్ష