టి.ఆర్.ఎస్ గెలుపుపై నాని కామెంట్

December 11, 2018


img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక రెండవ సారి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో గులాబి పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. కె.సి.ఆర్ నాయకత్వంలో టి.ఆర్.ఎస్ పార్టీ 88 స్థానాల పూర్తి మెజారిటీతో ఏకగ్రీవంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజల అంగీకారం పొందింది. డిసెంబర్ 7న పోలింగ్ జరుగగా డిసెంబర్ 11 మంగళవారం ఓట్ల లెక్కలు జరిగాయి. ఫైనల్ గా ప్రజా తీర్పుని ప్రతిపక్ష పార్టీలు ఆహ్వానిస్తున్నాయి.

అయితే టి.ఆర్.ఎస్ పార్టీకి ప్రముఖుల అభినందనలు అందుతున్నాయి. ఈ క్రమంలో నాచురల్ స్టార్ నాని ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం అభివృద్ధి కోసం తమ వంతు బాధ్యత నిర్వరించారని.. వారి నమ్మకం మీరు నిలబెట్టాలని.. వారికి అభివృద్ధి ఫలాలను అందిస్తారనే నమ్మకం ఉందని.. కె.సి.ఆర్- కె.టి.ఆర్ ఇంకా టి.ఆర్.ఎస్ పార్టీ నాయకులందరికి నాని శుభాకాంక్షలు తెలిపారు. Related Post

సినిమా స‌మీక్ష