ఒక్కబుల్లెట్ అంతమందా.. కంగ్రాట్స్ కె.టి.ఆర్ అన్న..!

December 11, 2018


img

ఉద్యమంతో రాబట్టుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మార్చే దిశగా నాలుగున్నర ఏళ్ల పరిపాలనలో కె.సి.ఆర్ ఎన్నో పథకాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేశారు. అందుకే తెలంగాణా రాష్ట్ర ప్రజలు మళ్లీ కె.సి.ఆర్ ప్రభుత్వాన్నే కావాలని భావించారు. ఈరోజు ఫలితాలు వెళ్లడవుతాయని తెలిసి అందరు టివిలకు అతుక్కుపోయారు.   


కౌంటింగ్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే టి.ఆర్.ఎస్ అభ్యర్ధుల ఆధిక్యత మొదలైంది. దానితో కె.టి.ఆర్ గన్ తో షూట్ చేస్తున్న పిక్ ఒకటి ట్వీట్ చేశారు. ఆ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ ట్వీట్ చూసిన మంచు మనోజ్ ఒక్క బుల్లెట్ తో అంతమందా.. ఇది ఎప్పటికి మర్చిపోలేని షాట్.. టి.ఆర్.ఎస్ గెలుపు సందర్భంగా కంగ్రాట్స్ కె.టి.ఆర్ అన్నా.. మీరు భవిష్యత్తులో తెలంగాణాను మరింత అభివృద్ధి చేస్తారని మిమ్మల్ని ప్రజలు అభిమానిస్తుంటారని ట్వీట్ చేశారు మంచు మనోజ్. 


తెలంగాణాలో టి.ఆర్.ఎస్ పార్టీ ఘన విజయం దక్కించుకున్న సందర్భంగా కె.టి.ఆర్ తెలంగాణా ప్రజలకు రుణపడి ఉంటానని.. మరోసారి కె.సి.ఆర్ ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు తెలంగాణా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. Related Post

సినిమా స‌మీక్ష