నాగబాబు వర్సెస్ నందమూరి ఫ్యాన్స్

December 11, 2018


img

ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని చెప్పిన నాగ బాబు అలా చెప్పి తప్పుచేశానని చెప్పి బాలకృష్ణ ఎవరో తనకు తెలుసని ఆయన ఓ పెద్ద కమెడియన్ అని.. ఎన్.టి.ఆర్, కృష్ణలతో కలిసి సినిమాలు చేశాడని వళ్లూరు బాలకృష్ణని గుర్తు చేసుకుని నందమూరి బాలకృష్ణను అవమానపరిచాడు మెగా బ్రదర్. ఏపిలో పవన్ జనసేన టిడిపి ఎగైనెస్ట్ గా ఉంటున్న టైంలో బాలకృష్ణను పవన్ గురించి అడిగితే అతనెవరో తెలియదని అన్నాడు. 

ఇప్పుడు సేమ్ టూ సేమ్ బాలకృష్ణ గురించి కూడా నాగబాబు అలానే రియాక్ట్ అయ్యాడు. అయితే మెగా నందమూరి ఫ్యామిలీల మధ్య ఇన్నాళ్లు ఉండే సినిమా ఫైట్ కాస్త పొలిటికల్ ఫైట్ గా మారిందని అర్ధమవుతుంది. నాగ బాబు ఇంటర్వ్యూ చూసిన నందమూరి ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంటే.. మెగా ఫ్యాన్స్ కూడా నందమూరి ఫ్యాన్స్ ను ఎదుర్కుని కామెంట్స్ చేసుకుంటున్నారు. 

ఇక రాబోతున్న వరుణ్ తేజ్ అంతరిక్షం మూవీ మీద నందమూరి ఫ్యాన్స్ తమ ప్రతాపం చూపించేలా ఉన్నారు. కొన్ని ఏరియాల్లో ఆ సినిమా రిలీజ్ అవకుండా అడ్డుకునేలా చూస్తున్నారట. మరి వీటి పర్యావసానాలు ఎలా ఉంటాయో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష