ట్రిపుల్ ఆర్ లో ఛాన్స్ పట్టేశాడు

December 10, 2018


img

మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ లో ఛాన్స్ కొట్టేశాడు అర్జున్ రెడ్డి కమెడియన్ రాహుల్ రామకృష్ణ. అర్జున్ రెడ్డి హిట్ అవడంతో విజయ్ దేవరకొండకే కాదు రాహుల్ రామకృష్ణకు అవకాశాలు పెరిగాయి. ఈమధ్య వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో కూడా రాహుల్ రామకృష్ణ నటించాడు. అయితే ఇప్పుడు ఆ కమెడియన్ కు రాజమౌళి సినిమా ఆఫర్ దక్కింది. 

ఈ విషయాన్ని రాహుల్ రామకృష్ణ స్వయంగా వెళ్లడించడం విశేషం. ఆర్.ఆర్.ఆర్ లో భాగం అవుతున్నా అని ఎనౌన్స్ చేసిన రాహుల్ అది ఎలాంటి పాత్ర అన్నది మాత్రం చెప్పకూడదని అన్నాడు. నవంబర్ 11 నుండి షూటింగ్ మొదలుపెట్టిన రాజమౌళి మొదటి షెడ్యూల్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ హీరోయిన్స్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.  



Related Post

సినిమా స‌మీక్ష