అతడులో శోభన్ బాబు చేసుంటే..!

December 10, 2018


img

సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ అతడు. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ లో మురళి మోహన్ ఈ సినిమా నిర్మించారు. ఈ మూవీలో నాజర్ చేసిన పాత్రకు ముందు శోభన్ బాబుని అనుకున్నారట. తెలుగు వెండితెర మీద అందమైన హీరోగా అప్పటి తరం అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్న శోభన్ బాబు హీరోగా చేసి హీరోగానే కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆయన్ని సపోర్టింగ్ రోల్స్ వేయించాలని ఎంతోమంది ప్రయత్నించినా కుదరలేదు.

అతడు సినిమాలో కూడా ఆయన్ను తీసుకునేందుకు బ్లాంక్ చెక్ ఇచ్చినా సరే వద్దని చెప్పారట. అంతేకాదు బాలీవుడ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్న బ్లాక్ సినిమాను తెలుగులో శోభన్ బాబుతో తీయాలని అనుకున్నా ఇక సినిమాలు వద్దని ఆయన గట్టిగా చెప్పేశారట. అతడులో మహేష్ తో శోభన్ బాబు స్క్రీన్ షేర్ చేసుకుని ఉంటే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉండేది.    



Related Post

సినిమా స‌మీక్ష