కళ్యాణ్ రాం బుక్కయ్యేవాడు..!

December 10, 2018


img

నందమూరి కళ్యాణ్ రాం పటాస్ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కినట్టు కనిపించినా ఆ తర్వాత వరుస ఫ్లాపులు చేస్తున్నాడు. ప్రస్తుతం కె.వి.గుహన్ డైరక్షన్ లో 118 అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్న కళ్యాణ్ రాం ఈమధ్య వచ్చిన ఓ మూవీని మిస్ చేసుకున్నాడని తెలుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ మామిళ్ల డైరక్షన్ లో వచ్చిన సినిమా కవచం. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో వచ్చిన ఈ సినిమా ఈమధ్యనే రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ బాగానే ఉన్నా సినిమా కలక్షన్స్ మాత్రం అంతగా లేవని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా కథ దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల కళ్యాణ్ రాం కు వినిపించాడట. అయితే ఆల్రెడీ పటాస్ లో పోలీస్ గా నటించాడు కాబట్టి కళ్యాణ్ రాం కవచం సినిమాను వద్దనుకున్నాడట. బెల్లంకొండ శ్రీనివాస్ కు డిఫరెంట్ గా అనిపించి ఉంటుంది కాని కళ్యాణ్ రాం కు అది రొటీన్ అవుతుందని అనుకుని కాదనేశాడు. లేదంటే కవచం కళ్యాణ్ రాం చేసుండాల్సింది. కాజల్, మెహ్రీ హీరోయిన్స్ గా నటించిన కవచం మూవీ బెల్లంకొండ శ్రీనివాస్ ఫ్లాప్ లిస్ట్ లో చేరింది.



Related Post

సినిమా స‌మీక్ష