4 గంటల సినిమా రెండు ముక్కలు చేశారు

December 10, 2018


img

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ ను క్రిష్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయ్యాక సినిమా కచ్చితంగా 4 గంటల దాకా వస్తుందని అంచనాకు వచ్చారట. అయినా సరే ఎన్.టి.ఆర్ సినిమా కాబట్టి 4 గంటలు ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయొచ్చని భావించాడట క్రిష్. 4 గంటలు సినిమా 2 ఇంటర్వల్ పెట్టేసి రిలీజ్ చేద్దామని అనుకున్నారట. 

అయితే ఎంత కంటెంట్ ఉన్నా 4 గంటల సినిమా అంటే ఆడియెన్స్ భయపడే అవకాశం ఉంటుంది. ఈమధ్య 3 గంటల సినిమాలు సక్సెస్ అవుతున్నా రెండు గంటల నిడివిలో మ్యాటర్ లేకపోతేనే తిప్పికొట్టే ప్రేక్షకులు 4 గంటల సినిమా అంటే కచ్చితంగా షాక్ అవుతారు. అందుకే ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు జనవరి 9న రిలీజ్ ప్లాజ్ చేస్తున్నారు. అదే నెల 24న ఎన్.టి.ఆర్ మహామయకుడు రిలీజ్ అంటున్నారు. సినిమా విషయంలో ప్రతిది జాగ్రత్త పడుతున్న క్రిష్ ఎలా ఉంటుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష