చరణ్, వరుణ్ లకు తేడా అదే

December 10, 2018


img

మెగా హీరోలైన రాం చరణ్, అల్లు అర్జున్ లకు వచ్చిన క్రేజ్, ఫాలోయింగ్ మిగతా మెగా హీరోలకు లేదని చెప్పొచ్చు. ఇదే విషయం మీద స్పందించారు మెగా బ్రదర్ నాగ బాబు. చిరంజీవి వారసుడిగా రాం చరణ్ ఎంట్రీ గ్రాండ్ గా జరిగింది. అయితే వరుణ్ తేజ్ ఎంట్రీ అలా కాదు అసలైతే వరుణ్ తేజ్ ను అశ్వనిదత్ ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంది. క్రిష్ డైరక్షన్ లో ఆ సినిమా ఉండాల్సింది. కాని శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో సినిమా చేయాల్సి వచ్చింది.

వరుణ్ తేజ్ సినిమాల విషయంలో తన జోక్యం అసలు ఉండదని.. సినిమా ఓకే చేశాక ఓసారి డిస్కస్ చేస్తాడని అన్నాడు నాగబాబు. ప్రస్తుతం వరుణ్ తేజ్ కెరియర్ శాటిసఫైడ్ గా ఉందని మంచిగా సంపాదిస్తున్నాడని అయినా సరే తన దగ్గర పాకెట్ మనీ అడుగుతున్నాడని అన్నారు నాగబాబు. ప్రస్తుతం వరుణ్ తేజ్ అంతరిక్షం, ఎఫ్-2 సినిమాలు చేస్తున్నాడు. అంతరిక్షం స్పేస్ సబ్జెక్ట్ తో వస్తుంటే.. ఎఫ్-2 వెంకటేష్ తో ఫన్ ఫిల్డ్ మల్టీస్టారర్ గా వస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష