కరణ్ షోలో ప్రభాస్..?

December 08, 2018


img

బాలీవుడ్ డైరక్టర్ కం ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బుల్లితెర మీద చేస్తున్న షో కాఫీ విత్ కరణ్. హోస్ట్ గా కూడా క్రేజ్ తెచ్చుకున్న కరణ్ జోహార్ బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరితో ఇంటర్వ్యూస్ చేసి వారి సీక్రెట్ విషయాలను బయట పెడుతున్నాడు. కరణ్ ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఎంత ఘాటుగా ఉంటాయో ఇదవరకు ఇంటర్వ్యూస్ చూస్తే తెలుస్తుంది. ఇదిలాఉంటే కాఫీ విత్ కరణ్ షోలో బాహుబలి టీం పాటిస్పేట్ చేస్తున్నారట.  

రాజమౌళి, ప్రభాస్, రానా ముగ్గురు ఈ షోలో పాల్గొననున్నారట. రాజమౌళి నుండి ట్రిపు ఆర్ సీక్రెట్స్, రానా సినిమాల అప్డేట్స్ తో పాటుగా ప్రభాస్ మ్యారేజ్ రూమర్స్.. ప్రభాస్, అనుష్కల మధ్య ఉన్న రిలేషన్ గురించిన ప్రశ్నలతో షో అంతా క్రేజీగా సాగుతుందట. ఈ షోకి సంబందించి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సాహో సినిమా విషయాలను ఎక్స్ క్లూజివ్ గా కరణ్ షోలో బయటపెడతారని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష