మేర్లపాక గాంధితో నాగ చైతన్య

December 06, 2018


img

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో హిట్ అందుకున్న మేర్లపాక గాంధి ఈ ఇయర్ నానితో కృష్ణార్జున యుద్ధం సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని అందుకోలేదు. కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ డైరక్టర్ మేర్లపాక గాంధి తన తర్వాత సినిమా అప్డేట్ తో వార్తల్లో నిలిచాడు. అక్కినేని నాగ చైతన్యతో మేర్లపాక గాంధి సినిమా ఉంటుందని తెలుస్తుంది. వి క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుందట.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తుందని తెలుస్తుంది. అ! సినిమా తర్వాత నిత్యా మీనన్ నటించే సినిమా ఇదే అవడం విశేషం. అంతేకాదు చైతుతో నిత్య మొదటిసారి జోడీ కడుతుంది. ప్రస్తుతం నాగ చైతన్య శివ నిర్వాణ డైరక్షన్ లో మజిలి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. నిత్యా మీనన్ జయలలిత బయోపిక్ లో నటిస్తుంది. మరి చైతు, నిత్యాల కాంబో ఎలా ఉండబోతుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష