తేజ, బెల్లంకొండ శ్రీనివాస్ టైటిల్ ఫిక్స్

December 06, 2018


img

సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా వరుస సినిమాలైతే చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. శుక్రవారం కవచం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమతో పాటుగా తేజ డైరక్షన్ లో మూవీ సెట్స్ మీద ఉంచాడు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు టైటిల్ గా సీత అని ఫిక్స్ చేశారట. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ తో కాజల్ మరోసారి జోడీ కడుతుంది. కవచంలో కూడా బెల్లంకొండ శ్రీనివాస్ తో కాజల్ నటించింది. ఈ ఇద్దరు కలిసి చేస్తున రెండో సినిమా సీత. ఇక టైటిల్ గురించి మాట్లాడితే సీత పాత్ర కాజల్ దే కావొచ్చని అంటున్నారు. సినిమాలో మన్నారా చోప్రా మరో హీరోయిన్ గా నటిస్తుంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన తేజ సీత సినిమాను ఏం చేస్తాడో చూడాలి.   Related Post

సినిమా స‌మీక్ష