వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..!

December 06, 2018


img

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతి బరిలో దిగుతుంది. ఈ మూవీ నుండి మొదటి సాంగ్ గా తందానా తందానా అంటూ ఫ్యామిలీ మొత్తం ఉత్సాహంగా ఉండే సాంగ్ రిలీజ్ చేశారు.

ఇక ఇవాలో రేపో సినిమా నుండి మరో సాంగ్ రిలీజ్ చేస్తారట. ఒక సాంగ్ పెండింగ్ లో ఉన్న ఈ సినిమా ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల చివరన ఉంటుందని తెలుస్తుంది. వైజాగ్ లో వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.     Related Post

సినిమా స‌మీక్ష