కె.జి.ఎఫ్ గెస్ట్ గా రాజమౌళి..!

December 06, 2018


img

కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కె.జి.ఎఫ్ చాప్టర్ 1. కన్నడలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, హింది, మళయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 21న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై సినిమాపై అంచనాలు పెంచింది. ఇక తెలుగులో ఈ సినిమాను వారాహి చలన చిత్రం రిలీజ్ చేస్తుంది.


సాయి కొర్రపాటి తెలుగు వర్షన్ రైట్స్ తీసుకున్నారు. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళిని చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారు. డిసెంబర్ 9 సాయంత్రం 6:30 గంటలకు కె.జి.ఎఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్ కు రాజమౌళి రావడం కన్ఫాం అయ్యింది. బాహుబలి తర్వాత అన్ని భాషల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి కన్నడ సినిమాకు సపోర్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాపై రాజమౌళి కామెంట్ ఏంటో ఈవెంట్ లో చెబితే కాని తెలియదు. Related Post

సినిమా స‌మీక్ష