నానితో దుల్కర్ సల్మాన్

December 05, 2018


img

నాచురల్ స్టార్ నాని జెర్సీ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. మల్టీస్టారర్ కథ అయినా సరే నానికి నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పాడట. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో నానితో పాటుగా నిఖిల్ ఈ సినిమాలో నటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే నాని పక్కన నటించేది నిఖిల్ కాదు మళయాల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అని తెలుస్తుంది. మహానటి సినిమాలో జెమిని గణేషన్ పాత్ర చేసిన దుల్కర్ ఆ సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.  

ఆల్రెడీ ఇదవరకే ఓకే కణ్మని సినిమా దుల్కర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మహానటితో ఆ క్రేజ్ ఇంకాస్త పెరిగింది. నానితో పాటు దుల్కర్ అయితేనే బాగుంటుందని అలా చేస్తే మళయాళం, తమిళంలో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని దిల్ రాజు ప్లాన్ చేశాడు. మరి నాని దుల్కర్ ల మల్టీస్టారర్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.Related Post

సినిమా స‌మీక్ష