మల్టీస్టారర్ లో అనసూయ ఐటం

December 05, 2018


img

ఓ పక్క యాంకర్ గా ఫుల్ ఫాంలో ఉన్న అనసూయ మరోపక్క సిక్వర్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుతుంది. క్షణంలో విలన్ గా నటించిన అనసూయ రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టేసింది. మధ్యలో సాయి ధరం తేజ్ విన్నర్ లో సూయా సూయా అనసూయ అంటూ తన మీద రాసిన పాటతో స్పెషల్ సాంగ్ చేసిన సినిమాకు అంతగా ప్లస్ అవలేదు. ఇక ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్ చేస్తుందట అనసూయ.

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. ఈ సినిమాలో అనసూయ ఐటం సాంగ్ ఉంటుందట. వెంకటేష్ కు తమన్నా, వరుణ్ తేజ్ కు మెహ్రీన్ కౌర్ జంటగా నటిస్తున్న ఈ ఎఫ్-2 సినిమా మొత్తం వినోదభరితంగా ఉంటుందని అంటున్నారు. 2019 సంక్రాంతి బరిలో వస్తున్న ఈ సినిమాపై దిల్ రాజు పూర్తి నమ్మకంతో ఉన్నాడు. మరి సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ ఏమేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష