అఖిల్ అక్కడ హలో చెబుతున్నాడు..!

December 04, 2018


img

కింగ్ నాగార్జున నట వారసుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఫ్లాప్ అవగా ఆ తర్వాత వచ్చిన హలో కూడా నిరాశపరచింది. విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి డైరక్షన్ లో మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే అఖిల్ నటించిన హలో సినిమా తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారట.

ఇక్కడ సూపర్ హిట్ అయ్యుండి అక్కడ రిలీజ్ చేస్తున్నారంటే ఓ అర్ధం ఉంది. ఇక్కడ ఫ్లాప్ అయిన హలోని ఎందుకు తమిళంలో డబ్ చేస్తున్నారు అంటే విక్రం కుమార్ కు అక్కడ మంచి క్రేజ్ ఉంది. సూర్యతో 24 సినిమా తీసిన దర్శకుడు కాబట్టి విక్రం సినిమా తమిళ ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో హలో తమిళ్ డబ్బింగ్ వర్షన్ త్వరలో రిలీజ్ చేస్తున్నారట. డబ్బింగ్ సినిమా అయినా అఖిల్ తమిళంలో ప్రెజెంట్ చేసే తొలి ప్రాజెక్ట్ ఇదే అన్నమాట. మరి అక్కినేని వారసుడికి అక్కడ ఎలాంటి మార్కులు పడతాయో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష